సినీ ఇండస్ట్రీకి సీఎం బిగ్ షాక్
NEWS Dec 22,2024 03:44 am
తెలుగు సినిమా రంగానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నుంచి ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. హీరో అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఏమైనా దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవుడా అని ప్రశ్నించారు. డీసీపీ హెచ్చరించినా పట్టించు కోలేదని , అరెస్ట్ చేస్తామంటే వెళ్లారని ఆరోపించారు.