సీఎం కామెంట్స్ అల్లు అర్జున్ సీరియస్
NEWS Dec 21,2024 03:52 pm
పుష్ప-2 మూవీ ఘటనపై సీరియస్ గా స్పందించారు నటుడు అల్లు అర్జున్. సీఎం తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దమని, వాస్తవ దూరమని పేర్కొన్నారు. జరిగిన ఘటన బాధాకరమని అన్నారు. రేవతి చని పోవడం దురదృష్టకరమని వాపోయారు. అనుకోని ప్రమాదం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో వాస్తవం లేదన్నారు. పర్మిషన్ ఉండడం వల్లనే వెళ్లానని చెప్పారు.