మల్యాల మండల కేంద్రంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది . స్థానిక ఒర్రెగడ్డ సమీపంలో నివాసం ఉంటున్న ఉంగరాల సునీత బీడీ కార్మికురాలు. తన ఇంటిలో ఎప్పటిలాగే దేవుడి ముందు దీపం వెలిగించింది. బయటకు వెళ్లి వచ్చేసరికి దీపం నుండి మంటలు చెలరేగి ఇంటిని అంటుకున్నాయి. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లో వున్న కొన్ని వస్తువులు కాలిపోయాయని సునీత తెలిపారు.