మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
NEWS Aug 09,2026 02:00 pm
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా చూసి స్కూటీపై వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు మాల్ సెక్యూరిటీతో గొడవపడి కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు. ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని కారుతో 3సార్లు బలంగా ఢీకొట్టినట్లు CCTV ఫుటేజీలో వెల్లడైంది. తీవ్రంగా గాయపడిన ప్రియాంకను ఆస్పత్రికి తరలించారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు, మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి, అవసరమైతే మరిన్ని కఠిన సెక్షన్లు జతచేస్తామని ఎస్పీ తెలిపారు.