టీచర్ వాట్సాప్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్ళు
NEWS Dec 20,2024 03:42 pm
మల్యాల మండల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాల కరస్పాండెంట్ పోకల నరేష్ వాట్సాప్ ను సైబర్ నేరగాళ్ళు హ్యాక్ చేశారు. వాట్సాప్ డీపీ కూడా చేంజ్ చేసి, ఆ నెంబర్ ద్వారా అతనికి వున్న వాట్సాప్ కాంటాక్ట్స్ అందరికి HDFC apk ఫైల్ పంపించారు. ఇది గ్రహించిన నరేష్ అప్రమత్తమై స్థానిక HDFC బ్యాంకు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఇలాంటి వాటి పైన పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుకుంటున్నారు.