మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. డిసెంబర్ 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేసుపై విచారణ కొనసాగుతుందని పేర్కొంది. కేటీఆర్ తరపున ప్రముఖ లాయర్ సుందరం వాదించారు. ప్రభుత్వ లాయర్ కు ముచ్చెమటలు పట్టించారు.