తెలంగాణలో చలి తీవ్రత
NEWS Dec 19,2024 10:23 am
తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ . ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. హన్మకొండ, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.