జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు గాయత్రి కళాశాల విద్యార్ధి
NEWS Dec 18,2024 09:36 am
పెద్దపల్లి గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన పీజీ సెకండియర్ చదువుతున్న అప్పన్నపేట గ్రామానికి చెందిన పిడుగు శ్రీకాంత్ ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా సౌత్ జోన్ యూనివర్సిటీ స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఎంపిక కావడం గర్వంగా ఉందని కళాశాల అధినేత అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 25, 2024 నుండి జనవరి 5 (2025) వరకు పంజాబ్ లో జరిగే పోటీలకు హాజరు అవుతున్నారని, ఈ ఘనత సాధించడానికి కళాశాల అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు.