తమిళనాడు మంత్రి రాజేంద్రన్ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డిని కలుసుకున్నారు. తమిళనాడు టూరిజం కార్పొరేషన్‍కు టీటీడీ నుండి స్పెషల్ ఎంట్రీ టికెట్లను కేటాయించాలని కోరారు. మంత్రికి లేఖను అందజేసారు. తమిళనాడు ప్రజలకు టిటిడి శీఘ్ర దర్శన టికెట్లను పునరుద్ధరించాలని విన్నవించారు. కొన్నేళ్ల నుంచి తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు టిటిడి దర్శన టిక్కెట్లను కేటాయిస్తుందన్నారు.