మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్బంగా చోటు చేసుకున్న సంఘటనకు తాను చింతిస్తున్నానని అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ తనకు ఇచ్చిన గౌరవాన్ని ఎన్నడూ మరిచి పోలేనని, నేతలు, కార్యకర్తలు తనను మన్నించాలని కోరారు.