క్రమబద్ధీకరించే వరకూ సమ్మె
NEWS Dec 17,2024 10:26 am
తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గత ఏడు రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన తెలిపారు. చెవుల్లో పూలు పెట్టుకుని తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సమ్మెను ఉద్దేశించి పాండరి, తిరుపతి మాట్లాడుతూ ప్రజా పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట తప్పారని ఆరోపించారు.