మంచు మనోజ్ పై మోహన్ బాబు భార్య నిర్మలా దేవి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొడుకు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. తన పుట్టిన రోజు సందర్బంగా మంచు విష్ణు ఇంటికి వచ్చాడని అన్నారు. కేక్ తీసుకు వచ్చి కట్ చేయించాడని వెల్లడించారు. ఇంట్లోని జనరేటర్ లో చక్కెర పోశారని మనోజ్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ వాపోయారు.