ఫాక్స్ కాన్ సంస్థ ఎక్కడికీ పోలేదు
NEWS Dec 17,2024 07:05 am
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు అబద్దాలు ఆడుతున్నారని, కావాలని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఫాక్స్ కాన్ సంస్థ ఎక్కడికీ పోలేదన్నారు. సదరు సంస్థ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయబోతోందన్నారు. ఫాక్స్ కాన్ లాంటి సంస్థలు రావాలని కోరుకోవాలే తప్పా ఇలా దుష్ప్రచారం చేస్తారా అంటూ ప్రశ్నించారు.