మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇవ్వడాన్ని తప్పు పట్టారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ పై విచారణ కోసం గవర్నర్ అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు.