తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆయా కాలేజీల యాజమాన్యాలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించింది.