వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్
NEWS Dec 17,2024 02:41 am
ఢిల్లీ సహా దేశంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం ఉందని, అత్యంత కాలుష్య నగరాల సమాచారం ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాయు కాలుష్యంపై తమ ఆందోళన ఢిల్లీ గురించి మాత్రమే కాదని పేర్కొంది. ఘన వ్యర్థాల నిర్మూలనకు సంబంధించిన సమాచారం ఇవ్వనందుకు ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.