మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన షేర్ ఎర్రన్న (51) అనే వ్యక్తి దుబాయ్ లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దుబాయ్ లోని ఆజ్మాన్ ఏరియాలో బస్ బోల్తాపడగా.. అందులో ఉన్న కార్మికులు పలువురు మృతిచెందారు. అందులో దమ్మన్నపేటకు చెందిన ఎర్రన్న ఉన్నట్లు దుబాయిలోని మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.