రేవంత్..కోడంగల్ నీ అయ్య జాగీరా
NEWS Dec 16,2024 11:30 am
సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ, కోడంగల్ నీ అయ్య జాగీరా అని నిలదీశారు. రైతులు తమ భూమి ఇవ్వం అని అంటే జైల్లో పెడతావా అని మండిపడ్డారు. లగచర్ల రైతులకు సంకెళ్లు వేసిన అమానవీయ ఘటనపై.. అసెంబ్లీలో చర్చ పెట్టమంటే పెట్టకుండా పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. రైతులకు క్షమాపణ చెప్పేంత దాకా పోరాడుతూనే ఉంటామన్నారు.