పిన్న వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజుకు చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. తమిళనాడు ప్రభుత్వ స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ స్వాగతం పలికింది. సింగపూర్ లో జరిగిన కీలక మ్యాచ్ లో చైనాకు చెందిన డింగ్ లారెన్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు. గుకేశ్ కు ప్రధాని మోడీతో సహా ప్రముఖులు అభినందించారు. స్టాలిన్ సర్కార్ ఏకంగా రూ. 5 కోట్లు రివార్డు ప్రకటించింది.