సీతమ్మ బావికి చందనం రంగు
NEWS Dec 17,2024 06:13 am
కొండగట్టు ఆంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రంలోని గిరి ప్రదక్షిణకు వెళ్లేదారిలో గల సీతమ్మ బావికి సోమవారం స్థానిక కాంగ్రెస్ నాయకుడు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి తన సొంత ఖర్చులతో రంగులు (చందనం కలర్) వేయించారు. అలాగే బావికి బొక్కెన, త్రాడు కూడ సమకూర్చారు. కాగా స్వామి వారికి నిత్యం అభిషేకాలు ఈ బావి నీళ్లతోనే చేస్తుంటారు. ఈ కార్యక్రమంలో దారం ఆదిరెడ్డి, నాంపల్లి గౌడ్, కొండబత్తిని అనిల్, తదితరులు పాల్గొన్నారు.