రేపటి నుండి సుప్రభాతం సేవ రద్దు
NEWS Dec 16,2024 07:27 am
శ్రీవారి ఆలయంలో మంగళవారం నుంచి సుప్రభాతం సేవ రద్దు చేస్తున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఇవాళ్టి నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం అయ్యాయి. తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ గుడుల్లో ధనుర్మాస కైంకర్యాలు, సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాలతో శ్రీవారికి మేలుకొలుపు జరుగుతుందన్నారు.