రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
NEWS Dec 16,2024 07:15 am
అమరావతి రాజధాని కోసం తమ భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ. నీరుకొండలో ఎంజీఆర్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గత సర్కార్ రాజధానిని కావాలని నాశనం చేసిందని ఆరోపించారు. పట్టాలు ఇచ్చిన పేదలకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థలాలు కేటాయిస్తామన్నారు.