అయోధ్యలోని రామ మందిరానికి భద్రతా విభాగంలో అంతర్జాతీయ అవార్డు లభించింది. రామ మందిర ప్రాజెక్టుకు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నుంచి స్వోర్డ్ ఆఫ్ హానర్స్ పురస్కారం లభించిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఈ సందర్బంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.