రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
NEWS Dec 15,2024 10:18 am
మల్యాల మండలంలోని తాటిపల్లి గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలు రాష్ట్రస్థాయి రన్నింగ్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ మానస తెలిపారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్టేట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్ షిప్ అండర్ 16 విభాగంలో 2k రన్ పోటిల్లో మొదటి స్థానంలో మనుస్మిత, ద్వితీయ స్థానంలో మనీషా, తృతీయ స్థానంలో రేవతి నిలిచినట్లు పేర్కొన్నారు.