సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. తమను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ తల్లిని చూస్తే కన్న తల్లి గుర్తుకు వస్తోందన్నారు. గద్దర్ అవార్డు అయినా నవ రత్నాల పురస్కారమైనా ఎవరూ ఊహించ లేదన్నారు. అది జాతీయ అవార్డు కంటే గొప్పదని పేర్కొన్నారు తేజ.