వైసీపీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీ పార్వతి
NEWS Dec 15,2024 03:39 am
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు వెల్లడించారు .