జైలు నుంచి విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసం సందడిగా నెలకొంది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు వరుస కట్టారు. ఒకరి వెంట మరొకరు వస్తుండడంతో పూర్తిగా ఇళ్లంతా నిండి పోయింది. వచ్చిన వారిని పలకరిస్తూనే ఉన్నారు బన్నీ. తాజాగా నటుడు శర్వానంద్ తో కొద్ది సేపు పిచ్చాపాటి మాట్లాడారు.