ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ వివాదంలో కేసులు
NEWS Dec 13,2024 11:44 am
నిజామాబాద్‌అర్బన్: బైపాస్ రోడ్డులోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ దారి వివాదంలో పరస్పర కేసులు నమోదయ్యాయి. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఆరీఫ్ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత మామ రాంకిషన్‌రావుపై కేసు నమోదు చేశామని.. అలాగే అపార్ట్‌మెంట్ వాసులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.