బాలిక కడుపు నుండి కేజీనర జుట్టును తొలగించిన డాక్టర్
NEWS Dec 13,2024 11:46 am
ఉప్పలగుప్తం మండలం భట్టుపాలెంకు చెందిన 15 సంవత్సరాల బాలిక కడుపునొప్పితో బాధపడుతుంటే ఆమె తల్లిదండ్రులు అమలా పురంలోని సాయి విశ్వాస్ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ గంధం విశ్వనాథ్ ఆమె పొట్టలో జుట్టు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి ఆమె కడుపులో ఉన్న కేజీనర జుట్టును తొలగించారు. బాలికకు వింత అలవాటు ఉండటంతో రహస్యంగా గత మూడేళ్లుగా తన జుట్టు తానే తింటునట్టు గుర్తించారు.