అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు ఫ్యాన్స్. పుష్ప-2 మూవీ సందర్బంగా చోటు చేసుకున్న ఘటనకు సంధ్య థియేటర్ యజమానితో పాటు బన్నీనే కారణం అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. అక్కడి నుంచి చంచల్ గూడకు తరలించారు. పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పీఎస్ తో పాటు చిక్కడపల్లి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.