జీతాల్లేవ్.. ఎలా బతకాలి: ఆర్పీల ఆవేదన
NEWS Dec 13,2024 08:41 am
కామారెడ్డి: వెట్టి చాకిరి చేస్తున్నాం.. ఏడు నెలలుగా జీతాలు లేవు. ఎట్లా బతకాలి అని మెప్మా ఆర్పీ కామారెడ్డి జిల్లాఅధ్యక్షురాలు భారతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ లోని సీఎండీ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్న ఆర్పీలను పోలీసులు కామారెడ్డిలో అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం ఠాణా నుంచి ఆర్పీలు వీడియో విడుదల చేశారు. ప్రజాపాలన, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో తాము చురుకుగా పాల్గొంటున్నామన్నారు. రూ. 6వేల జీతంతో తాము ఎలా బతకాలో తెలుపలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.