బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నిప్పులు చెరిగారు. మోహన్ బాబు వెంటనే మీడియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీ కుటుంబ సమస్య ఇంటి వరకే ఉంటే బాగుంటుందన్నారు. గాయపడిన జర్నలిస్టు రంజిత్ ను పరామర్శిస్తే మీకే మంచిదని హితవు పలికారు. లేకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. ఇష్యూని ఇలాగే వదిలేస్తే మరింత పెద్దదవుతుందన్నారు.