సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. అక్రమాలకు పాల్పడింది కాకుండా తనను ఏం పీకుతాడంటూ మాట్లాడటం ఎంత వరకు సబబు అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను తాము ఎందుకు చంపుతామంటూ ప్రశ్నించారు. ఆయనను ప్రజలు ఏనాడో ఫామ్ హౌస్ కు పరిమితం చేశారని అన్నారు.