అధికారుల ఆస్తులు జప్తు చేయండి
NEWS Dec 12,2024 03:36 am
తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలకు పర్మిషన్స్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వారి ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. బఫర్ జోన్ అని తెలిసినా ఎలా అనుమతులు ఇచ్చారంటూ ప్రశ్నించింది. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది కోర్టు.