రాయుడు గారి మిలటరీ హోటల్ ప్రారంభించిన ఎంఎల్ఏ
NEWS Dec 12,2024 12:14 pm
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయుడు గారి మిలిటరీ హోటల్ ను మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. హోటల్ లోని డైనింగ్ ఏరియా, కిచెన్, స్పెషల్ గదులను పరిశీలించారు. వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముందుగా హోటల్ యాజమాన్యం ఎమ్మెల్యే కృష్ణప్రసాదుని ఘనంగా స్వాగతించారు. ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.