శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లు
NEWS Dec 11,2024 03:09 am
తిరుమల శ్రీవారిని 67,284 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లు వచ్చిందని వెల్లడించారు ఈవో జె.శ్యామలరావు. ప్రస్తుతం ఒక కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు కనీసం స్వామి వారి దర్శనానికి 8 గంటలకు పైగా పడుతుందని తెలిపారు.