ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం దాసరిపల్లి గ్రామ పరిసరాల్లో భూమి కంపించింది. గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 12.15 గంటలకు భూకంపం సంభవించింది. భూమి లోపల 10 కిలోమీటర్ల లోపు ప్రకంపనలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. మరోసారి వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.