భయంతోనే ఆర్జీవీ గాయబ్
NEWS Dec 02,2024 03:04 am
అరెస్ట్ చేస్తారనే భయంతోనే రామ్ గోపాల్ వర్మ పారి పోయాడని అన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. జగన్ సహకారంతో రెచ్చి పోయాడని, మార్ఫింగ్ ఫోటోలతో పైశాచిక ఆనందం పొందాడని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లను కించ పరిచేలా మూవీస్ తీశాడని అన్నారు. ఇప్పుడు కేసులకు భయపడి అడ్రస్ లేకుండా దాక్కున్నాడని ఫైర్ అయ్యారు. దమ్ముంటే బయటకు రావాలని, పిరికిపంద లాగా పారిపోతే ఎలా అని ప్రశ్నించారు.