మరాఠా సీఎంపై మోడీదే ఫైనల్
NEWS Dec 02,2024 02:57 am
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చారు ఆపద్దర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే. ఎన్నికల ఫలితాలు వెలువడినా ఇప్పటి వరకు ఎవరినీ ఎంపిక చేయలేదు మహాయుతి కూటమి. సీఎం ఎవరనే దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. అయితే తాను సీఎం రేసులో లేనని చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ల మధ్య ఎవరో ఒకరు సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.