తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రైతు భరోసాపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడిగా మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు శాసన సభకు రావడం లేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు.