మోడీ..కేసీఆర్ కు రేవంత్ సవాల్
NEWS Nov 30,2024 01:20 pm
సీఎం రేవంత్ రెడ్డి రుణ మాఫీకి సంబంధించి రూ. 2,747.67 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఎక్కడైనా ఇంత పెద్ద ఎత్తున రుణ మాఫీ చేసిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పాలమూరులో జరిగిన రైతు పండుగ సభలో పీఎం మోడీ , మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. దమ్ముంటే రుణ మాఫీకి సంబంధించి తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు సీఎం. తమది రైతు పక్ష పాత ప్రభుత్వమని స్పష్టం చేశారు.