బెల్ట్ షాపులు పెడితే తోలు తీస్తా
NEWS Nov 30,2024 11:46 am
రాష్ట్రంలో ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తవ్వే కొద్దీ గత ప్రభుత్వం చేసిన పాపాలు కుప్పలు తెప్పలుగా బయట పడుతున్నాయని ఆరోపించారు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ మండిపడ్డారు. వీటికి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు సీఎం. మద్యం షాపుల విషయంలో నేతలు, దందాలు చేసే వారు మధ్యలో దూరితే వదిలి పెట్టనంటూ వార్నింగ్ ఇచ్చారు