ఫెంగల్ తుఫాన్ పై సీఎం సమీక్ష
NEWS Nov 30,2024 09:36 am
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెంగల్ తుఫానుగా మారడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. అన్ని స్థాయిలలో ప్రభుత్వ యంత్రాంగం ఉండాలని ఆదేశించారు. రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్దంగా ఉంచు కోవాలని ఆదేశించారు సీఎం.