పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలి
NEWS Nov 30,2024 09:00 am
అమరావతిలో విజయవాడ కీలకంగా ఉందని, ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించాలని అన్నారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు అవసరమైన సదుపాయాల కల్పనకు యుద్ద ప్రాతిపదికన ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ప్రధానంగా రహదారుల నిర్మాణం ముఖ్యమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు.