పేదలు ఇబ్బంది పడకూడదని తమ ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోందని అన్నారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. గొలుగొండ మండలం ఏటిగైరంపేటలో వర్షంలోనే పింఛన్ల పంపిణీ చేశారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గత వైసీపీ సర్కార్ హయాంలో పింఛన్ల పంపిణీకి మూడు రోజుల సమయం పట్టేదన్నారు. కానీ చంద్రబాబు చొరవతో ఆ ఇబ్బందులు లేకుండా చేశారని చెప్పారు స్పీకర్.