ముత్యపు పందిరిపై అలివేలుమంగ
NEWS Nov 30,2024 07:27 am
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మ వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మ వారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, గంధంతో అభిషేకం చేశారు. టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది.