మైలవరం పరిధిలో TDP సభ్యత్వాలు
NEWS Nov 30,2024 11:40 am
మైలవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 40,107 టీడీపీ సభ్యత్వాలను నమోదు చేసినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. ఫోన్ లో ఆన్ లైన్ ద్వారా సభ్యత్వాలను నమోదు చేసి సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన డిజిటల్ ధ్రువీకరణ పత్రాలను సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గ పరిధిలో పార్టీ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొంటున్న టీడీపీ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఎమ్మెల్యే అభినందించారు.