తిరుమలలో భక్తుల కిటకిట
NEWS Nov 30,2024 05:31 am
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీవారిని 62,417 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చింది. సర్వ దర్శనం కోసం 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి కనీసం 18 గంటల సమయం పడుతుంది.