మాజీ క్రికెటర్ సిద్దూకు బిగ్ షాక్ తగిలింది. తన భార్య క్యాన్సర్ కు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 7 రోజులలో సరైన వివరణ ఇవ్వాలని కోరింది. స్పెషల్ డైట్ తీసుకోవడం వల్ల తన భార్యకు ఉన్న క్యాన్సర్ తగ్గి పోయిందంటూ పేర్కొన్నారు. సంస్థ ప్రచారం కోసం సిద్దూ అలా చేయడం తప్పంటూ కోర్టుకు ఎక్కింది సివిల్ సొసైటీ. నిరూపించక పోతే ఏకంగా రూ. 850 కోట్లు చెల్లించాలని కోరింది.