శ్రీకపిలేశ్వరాలయంలో రుద్రయాగం
NEWS Nov 30,2024 03:00 am
తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో 11 రోజుల పాటు జరిగిన రుద్ర యాగం ముగిసింది. మహా పూర్ణాహుతి, మహా శాంతి అభిషేకం, కలశ ఉద్వాసన, శ్రీ కపిలేశ్వర స్వామి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. శివ పార్వతుల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ కాలభైరవ స్వామి వారి కలశ స్థాపన, కలశ ఆరాధన నిర్వహించారు. భక్తులతో పాటు టీటీడీ జేఈవో గౌతమి, డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు పాల్గొన్నారు.